Temple | అన్నసమారాధన

Temple | అన్నసమారాధన

  • రాజశేఖరస్వామి దేవస్థానంలో నిర్వ‌హ‌ణ‌

Temple | అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : అవనిగడ్డలోని ప్రముఖ ప్రాచీన పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజశేఖరస్వామి(Sri Rajasekhara Swamy) దేవస్థానం(Temple)లో గురువారం మాస శివరాత్రి సందర్భంగా భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) ఆహ్వానం మేరకు నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజశేఖరస్వామిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వెంకట్రామ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ కన్నయ్య, డైరెక్టర్లు అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, అవనిగడ్డ రమేష్, కోసూరు అవినాష్ వెంకట్రామ్ ను సత్కరించారు.
అన్నదాన కమిటీ ప్రతినిధులు అరవా శ్రీనివాసరావు, అన్నపరెడ్డి వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, ముళ్లపూడి శ్రీనివాసరావు, కొండవీటి గోవిందు పాల్గొన్నారు.

Leave a Reply