Temple | పోటెత్తిన భక్తులు..

Temple | పోటెత్తిన భక్తులు..
Temple | తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి రూరల్ తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. ఉదయం 3.30 నిలకు వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ప్రత్యేక పూజలు చేసిన తరువాత వేద పండితులు, అర్చక స్వాముల సమక్షంలో వైకుంఠ ద్వారం తెరచుకుంది. స్వామిని దర్శించి వైకుంఠ ద్వారంలో భక్తులు ప్రవేశిస్తున్నారు. వైకుంఠ ద్వారంగోవింద నామస్మరణలతో తుమ్మల గుంట మారు మోగింది. ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లలో సాఫీగా భక్తులు సాగుతున్నారు. భక్తులకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దగ్గరుండి దర్శనం చేయిస్తున్నారు. అలాగే భక్తుకుల ప్రసాదాలు, తాగునీరు, పాలు పంపిణీ చేస్తున్నారు.


