Temple | దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్‌కు ప్రశంసల వర్షం..

Temple | దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్‌కు ప్రశంసల వర్షం..

మాయమైన బ్రాస్లెట్‌ను భక్తులకు తిరిగి అందజేసిన మహిళా సిబ్బంది
ఈవో నుంచి ప్రత్యేక సత్కారం

Temple | ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని దుర్గగుడిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా సెక్యూరిటీ గార్డ్ నిజాయితీ, కర్తవ్యనిబద్ధతకు ప్రతీకగా నిలిచారు. గుణదల ప్రాంతానికి చెందిన భక్తులు గురువారం అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా క్యూ లైన్‌లో ఒక బ్రాస్లెట్ కింద పడిపోయింది. ఆ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డ్ వెంటనే ఆ బ్రాస్లెట్‌ను సురక్షితంగా స్వాధీనం చేసుకుని, సంబంధిత భక్తులను గుర్తించి వారికి తిరిగి అందజేశారు.

ఈ ప్రక్రియ టెంపుల్ ఇన్స్పెక్టర్ డివిఎన్ రాజు (మంగళగిరి రాజు), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సమన్వయంతో పూర్తైంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న దేవస్థానం ఈవో శీనా నాయక్ శనివారం ఆ మహిళా సెక్యూరిటీ గార్డ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

ఆమెకు పట్టుచీరతో పాటు నగదు పురస్కారం అందజేసి సత్కరించారు. దేవస్థానంలో విధులు నిర్వహించే సిబ్బంది అంకితభావంతో, పారదర్శకంగా పని చేస్తే వారికి ఇలాంటి ప్రోత్సాహం అందించడం వల్ల ఇతర ఉద్యోగుల్లో కూడా బాధ్యతాభావం పెరుగుతుందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

Leave a Reply