temple | దేవస్థానంలో చీరలు వేలం పాట

temple | దేవస్థానంలో చీరలు వేలం పాట
temple | చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ కొత్తపేటలో నిత్యం భక్తులు ఆరాధించే అమ్మవారి దేవాలయంలో కె.టి రోడ్డులో ఉన్న శ్రీ గంగానమ్మ దేవస్థానం ప్రముఖమైనది. కొత్తపేట గంగానమ్మ దేవస్థానంలో భక్తులు శరన్నవరాత్రులు విశేషం గా పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకుంటారు. అలా శరన్నవరాత్రుల్లో భక్తులు మొక్కుల రూపం లో సమర్పించిన చీరలు బుధవారం వేలం పాట నిర్వహిస్తారని కనుక భక్తులు విరివిగా పాల్గొనాలని గత మూడు రోజులుగా ఆలయం ప్రాంగణంలో ఉన్న మైక్ సెట్ ద్వారా భక్తులకు తెలియపరచారు.
గురువారం ఉదయం దేవాదాయ శాఖ టెంపుల్ ఇన్స్పెక్టర్ ఏ. సుజన్ కుమార్ సమక్షంలో వేలం పాట నిర్వహించారు. అమ్మవారి చీరలు వేలం పాటలో 120 అమ్మవారి కి భక్తులు సమర్పించిన చీరలు భక్తులు పాడుకోవడం జరిగింది. అమ్మవారి 120 చీరల వేలం పాట ద్వారా 9930 రూపాయలు ఆదాయం గంగానమ్మ దేవస్థానానికి సమకూరింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని గంగానమ్మ దేవస్థానం వంశపారంపర్యం ధర్మకర్త వాండ్రాశి నానాజీ తెలిపారు.
