Temple | అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభం

Temple | అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభం
Temple | మోపిదేవి – ఆంధ్రప్రభ : కోరిన కోర్కెలు తీర్చే అమ్మ పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి గ్రామోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని గుడి నుండి బయటకు తీసి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఆనవాయితీలో భాగంగా ముందుగా యన్నం వారి కుటుంబీకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి గ్రామోత్సవాన్ని ప్రారంభించగా
ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల వెంకటరామయ్య,ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కుర్రా గురు ప్రసాద్, ఆలయ కమిటీ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు, పెదప్రోలు పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు యడ్లపల్లి లక్ష్మణరావు, పెదప్రోలు పిఎసిఎస్ మాజీ చైర్మన్ ఆది రవీంద్రబాబు, పెదప్రోలు గ్రామ కాపు సంఘం అధ్యక్షులు యన్నం వేణు, పెదప్రోలు గ్రామ కాపు సంఘం నాయకులు యడ్ల శేషు, యడ్లపల్లి రాజా,యన్నం శ్రీనివాసరావు, యన్నం సాంబశివరావు, యన్నం రత్తయ్య,యన్నం వెంకటేశ్వరరావు(చంటి), యన్నం పవన్ సాయి కృష్ణ, యన్నం సుబ్బారావు, యన్నం నాగార్జున,యన్నం లక్ష్మయ్య, యన్నం వెంకన్న, యన్నం రత్నారావు,యన్నం నారాయణస్వామి,
గౌరం సాంబశివరావు(పసి), గౌరం హర్ష వర్ధన్, దివి మోహనబాబు, బావిరెడ్డి వెంకటేశ్వరరావు, యన్నం ఉమేష్ ప్రసన్న కుమార్,యన్నం తేజ, యన్నం కృష్ణమోహన్, తోట వరప్రసాద్, కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, తాతా మురళి లతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 రోజులపాటు అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించుకొని మార్చి 4వ తేదీ రాత్రికి అమ్మవారి జాతర మహోత్సవం జరగనుంది. ఈసందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల వెంకటరామయ్య మాట్లాడుతూ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వేసవి ఎండల నేపధ్యంలో త్రాగునీటి సదుపాయం కల్పించడం జరుగుతుందని భక్తులు ఆలయ కమిటీకి సహకరించి అమ్మవారి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
