అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు..

- ఇరు రాష్ట్రాలకు ప్రవాహంగా పెట్టుబడులు…
- దేశంలోనే రైసింగ్ రాష్ట్రాలుగా పరుగులు..
- తిరువూరు శాసనసభ్యుడు కొలకపూడి శ్రీనివాసరావు..
ఆంధ్రప్రభ, విజయవాడ : పెట్టుబడులు తీసుకురావడంలో పోటీపడుతూ దేశంలోనే శరవేగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో శరవేగంగా పరుగులు తీస్తున్నాయని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
సుస్థిర పరిపాలన, నమ్మకం ఉండడంతోనే ప్రవాహంల ఇరు రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేట భారత్ ఫ్యూచర్ సిటీలో తొలిసారిగా 100 ఎకరాల విస్తీర్ణంలో భారీగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సదస్సులో పాల్గొని అక్కడికి విచ్చేసిన వివిధ కంపెనీల ప్రతినిధులు,ప్రముఖులు,ప్రజా ప్రతినిధులతో కలిసి సమ్మిట్ గురించి కాసేపు చర్చించారు.
అనంతరం అక్కడ ఏర్పాట్లను,రాబోయే మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టనున్న భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిలకించారు. అక్కడికి విచ్చేసిన పెట్టుబడిదారులకు ఇరు రాష్ట్రాలలో ఉన్న అవకాశాలు భవిష్యత్తు వ్యాపార ఉపయోగాలను వివరించారు.
