తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం ఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగింది. రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్టీ ఎంపీలతో సమావేశంలో లోకేష్ ఎన్నికల ప్రణాళికపై సమీక్ష జరిపారు. ఓటింగ్ విధానం గురించి స్పష్టమైన వివరాలు అందిస్తూ, ప్రతి ఓటు ప్రాముఖ్యతను గుర్తుచేశారు.

పార్లమెంటరీ వ్యవహారాల్లో క్రమశిక్షణ తప్పనిసరి అని లోకేష్ హితవు పలికారు. దేశ రాజకీయాలలో తెలుగు ప్రజల స్వరం బలంగా వినిపించాలంటే, ప్రతి సభ్యుడు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply