Telangana | రోడ్డు ప్రమాదంలో తండ్రి…

Telangana | రోడ్డు ప్రమాదంలో తండ్రి…
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుమారుడి పెళ్లి ఏర్పాట్ల కోసం వెళ్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పెళ్లింట శోకం అలుముకుంది.
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. స్థానికంగా నివాసం ఉంటున్న దుర్గయ్య తన కుమారుడి పెళ్లి కోసం అవసరమైన సామగ్రి తీసుకురావడానికి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు.
ఈ క్రమంలో బైక్‌ను లారీ ఢీకొట్టడంతో దుర్గయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇంకా రెండు రోజుల్లో కుమారుడి పెళ్లి జరగాల్సి ఉండగా, తండ్రి ఆకస్మిక మరణం పెళ్లింట విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా హృదయ విదారకంగా మారింది.
