Telangana | సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Telangana | సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Telangana | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. విదేశీ పర్యటనలో పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై కీలక చర్చలు జరిపిన సీఎం.. రాష్ట్రానికి వచ్చాక ఇక్కడి రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలపై ఫోకస్ పెట్టారు.

ఇవాళ్టి నుంచి ఆయన పూర్తిగా బిజీ షెడ్యూల్‌తో ముందుకు సాగనున్నారు. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ వ్యూహ రచన, ఎన్నికల ప్రచారంపై కీలక సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంత్రులు, పీసీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు.

Leave a Reply