Miss World పోటీలకు తెలంగాణ ఆతిథ్యం !

మిస్ వరల్డ్ 2025 పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు. మే 7 నుంచి 31 వరకు ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మిస్ వరల్డ్ పోటీలు చివరిసారిగా భారత్‌లో 1996లో నిర్వహించగా, 28 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా, ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన యువతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *