హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎప్‌సెట్ (టీజీఈఏపీసీఈటీ) కు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన విడుదల చేసింది. శనివారం అగ్రికల్చర్, ఫార్మసీ హాల్ టికెట్లను విడుదల చేయనుంది. అదేవిధంగా ఇంజినీరింగ్ హాల్ టికెట్లను ఏప్రిల్ 22న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి పరీక్ష తేదీ వరకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
పరీక్షల షెడ్యూల్ ఇదే
అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఈ నెల 29, 30 తేదీల్లో జరుగనుంది. ఏప్రిల్ 29న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 12 గంటలకు వరకు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహిస్తారు. ఇక ఈ నెల 30న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఇంజినీరింగ్ పరీక్షను మే 2 నుంచి 4 వరకు నిర్వహిస్తారు. రోజూ రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 12 గంటలకు వరకు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్‌కు 86,101 మంది, రెండు పరీక్షలకు 253 మంది దరఖాస్తు చేసున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాలను ఏర్పాటు చేశారు.