Telangana Student | జర్మనీలో తెలంగాణ‌ విద్యార్థి మృతి

Telangana Student | జర్మనీలో తెలంగాణ‌ విద్యార్థి మృతి

అగ్నిప్రమాదంలో విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి


Telangana Student | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : జర్మనీ (Germany)లో ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్థికి దారుణ మరణం సంభవించింది. అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం నుంచి దూకిన యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణలోని అత‌ని కుటుంబంలో విషాదం నింపింది.

జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలంగాణ (Telangana) కు చెందిన విద్యార్థి తోకల హృతిక్ రెడ్డి (Student Hrithik Reddy) మృతిచెందాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి జర్మనీలో ఉన్నత విద్య కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అతను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం నుంచి కిందికి దూకాడు.

ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన హృతిక్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. సమాచారం అందుకున్న భారత రాయబార కార్యాలయం (India Embassy) కుటుంబానికి సహాయం అందిస్తోంది. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Leave a Reply