WGL | క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడుతూ… ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం 11ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థికవృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అక్కడున్న వారితో ఎమ్మెల్యే ప్రతిన బూనారు.

అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Leave a Reply