Telangana | ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

Telangana | ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

Telangana | గన్నేరువరం, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్కరూ పంచ పరివర్తన సూత్రాలను అలవర్చుకొని, పాటిస్తూ జీవనం సాగించాలని బిజెపి మానకొండూర్ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి (Mutyala Jagan Reddy) అన్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంలో భాగంగా గుండ్లపల్లి లో శనివారం ఆర్ఎస్ఎస్ (RSS) శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హిందువులందరూ కులాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని, ప్రతి ఒక్కరూ పంచ పరివర్తన (Pancha Parivartan)ను పాటిస్తూ సంఘజీవనం గడిపినట్లు అయితే శాంతి సామరస్యాలతో దేశం వర్ధిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాళ్లపెల్లి పరుశురాం, ముదిగంటి సంజీవరెడ్డి, వడాల గోపాల్ రెడ్డి, పొలం వేణు, ఆర్ఎస్ఎస్ నాయకులు కొయ్యడ రవిచంద్ర,, రాపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply