Telangana | అక్రమ తవ్వకాలు ఆపాలి…
Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం లో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఆపాలని శుక్రవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బందెల రవిగౌడ్(Bandela Ravigoud) మాట్లాడుతూ.. మండలంలో ప్రభుత్వం గనులను అక్రమార్కులు దోసుకుపోతుంటే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.
ప్రతి రోజు పత్రికలలో కథనాలు వస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. అనంతరం మాజీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య(Gopathi Rajaiah) మాట్లాడుతూ… యసంగిలో రైతులు పండించిన సన్నవడ్లకు ప్రభుత్వం 500 బోనస్ ఇస్తానని ఇప్పటి వరకు కూడా బోనస్ చెల్లించకపోయారని, అంతే కాకుండా కడెం ఆయకట్టు కింద ఉన్న కాలువలు అన్ని పైపులు చెడిపోయిన చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందియకపోవడం బాధాకరమని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈలాంటి సమస్యపైన అధికారులు దృష్టి పెట్టకపోవడం ఎంత వరకు సమంజసం అన్నారు. కార్యక్రమంలో, మండల ఉపాధ్యక్షుడు వనపర్తి రాకేష్, మాజీ ఎంపీటీసీ వల్లంబాట్ల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ దుమ్మని సత్తయ్య, బూత్‌ల అధ్యక్షుడు వేముల హరీష్టే, కుమట్ల గురువయ్య, కుంచె స్వామి, స్వర్గం శంకర్, శ్రీనివాస్, కాట్ట చారి, తదితరులు పాల్గొన్నారు.

