క‌డెంలో తెలంగాణ హైకోర్టు జ‌స్టిస్‌ విహారం

క‌డెం, ఆంధ్రప్రభ : తెలంగాణ‌(Telangana)లో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ క‌డెం నారాయ‌ణ‌రెడ్డి ప్రాజెక్టు(Kadem Narayana Reddy Project) అందాల‌ను తెలంగాణ హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ సృజ‌న తిల‌కించారు. నిర్మ‌ల్ జిల్లా కోర్టును సంద‌ర్శించిన ఆమె ఈ రోజు నిర్మ‌ల్ జిల్లా కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ్రీ‌వాణితో క‌లిసి ప్రాజెక్టులో బోటు షికారు చేశారు. ఆమెతోపాటు కడెం ఎంఆర్ఐ శారద, క‌డెం ఎస్సై సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.

క‌శ్మీర్ అందాల‌ను మ‌య‌మ‌రిపిస్తున్న క‌డెం ప్రాంతం
క‌డెం ప్రాజెక్టు అందాల‌ను తిల‌కించిన హైకోర్టు జ‌డ్జి సృజ‌న మాట్లాడుతూ క‌డెం ప్రాజెక్టు అందాలు త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ని అన్నారు. క‌శ్మీర్ అందాల‌ను కూడా మ‌య‌మ‌రిపించేలా ఉన్నాయ‌న్నారు. ఇక్క‌డ‌ కొండలు గుట్టలు చాలా బాగున్నాయ‌ని చెప్పారు. ఇక్క‌డ‌ ప్రశాంత వాతావరణం త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని చెప్పారు.

Leave a Reply