తెలంగాణ భవన్ హస్తగతం..
మణుగూరు, (ఆంధ్రప్రభ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పట్టణంలోని తెలంగాణ భవన్ కార్యాలయం పై కాంగ్రెస్ నాయకులు సుమారు 500 మంది దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అలాగే బీఆర్ఎస్ జెండాల పై పెట్రోల్ పోసి తగలబెట్టారు. తెలంగాణ భవన్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ హస్తగతం అయింది. పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయం పై ఒక్కసారిగా వేలాది మంది కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా రేగా కాంతారావు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆనాటి నుండి బీఆర్ఎస్ కార్యాలయంగా ఏర్పాటు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటూ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఉన్న గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులకు పార్టీ కార్యాలయం దక్కించుకోవడంలో సాధ్యం కాలేక పోయింది. గత పది ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు టీఆర్ఎస్ కార్యాలయం పై దాడి చేయడంతో పాటు తెలంగాణ భవన్ లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను బయటికి గెంటి, అడ్డొచ్చిన వారి పై కాంగ్రెస్ నాయకులు పిడుగు దేబ్బలతో బయటకు పంపించారు.
ఫర్నిచర్ ను బయటపడేసి తగలబెట్టాడంతో రాజకీయ చర్చగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ నాయకులు ఫర్నిచర్ తగలబెట్టిన తర్వాత భవనానికి ఉన్న పేర్లను తుడిచిపెట్టి ఇందిరమ్మ భవన్ గా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు ఏర్పాటు చేసినప్పటికీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితిని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఫర్నిచర్ మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. తెలంగాణ భవన్ ఇందిరమ్మ కార్యాలయంలో రూపొందడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత టీఆర్ఎస్ పార్టీ పీడ విరగడైందని, కాంగ్రెస్ పార్టీకి ఇక తిరుగులేదని శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు.

