Telangana | పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి

Telangana | పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి
- తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమ్మర్దపు మురళి
Telangana | రామన్నపేట, ఆంధ్రప్రభ : పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమ్మర్దపు మురళి అన్నారు. ఇవాళ మండలంలోని వెల్లంకి గ్రామంలో ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన ఇడెం రాధా శ్రీనివాసును కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… పద్మశాలీలు సంఘటితమై ఐకమత్యంతో మెలిగి తమ గౌరవాన్ని, ప్రతిష్టతను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కందగట్ల స్వామి, జగన్నాథం, ప్రధాన కార్యదర్శి రామచంద్ర రావు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర చైర్మన్ వీరబత్తిని అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యులు ఎల్ రమణ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు చిక్క వెంకటేష్, రవ్వ పాండు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
