Telangana | సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌

Telangana | సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో 10 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌ నియమితులయ్యారు. ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌కుమార్‌ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

ప్రజావాణి రాష్ట్ర నోడల్‌ అధికారిగా కాత్యాయనీ దేవి, జలమండలి జేఎండీగా మయాంక్‌ మిట్టల్‌, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ్‌శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా దివ్యకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

అయితే… కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మూడు కార్పొరేషన్లకు కొత్తగా కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా శ్రీజన నియామకం కాగా, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇక, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వీ కర్ణన్ కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా జయేష్ రంజన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు అయ్యి, కొత్త పాలక మండలి వచ్చే వరకు జయేష్ రంజన్ ప్రత్యేక అధికారిగా ఉండనున్నారు.

Leave a Reply