Teja Sajja | 3 సీక్వెల్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న తేజ సజ్జ

Teja Sajja | 3 సీక్వెల్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న తేజ సజ్జ
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఓ బేబీ, జాంబిరెడ్డి, అద్భుతం, హనుమాన్, మిరాయ్.. ఇలా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుని సక్సెస్ సాధిస్తున్న యంగ్ హీరో తేజ సజ్జ. ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ యంగ్ హీరో.. నెక్ట్స్ ఇయర్ లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సీక్వెల్స్ తీసుకువచ్చేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. ఆ మూడు సీక్వెల్స్ ఏంటి..?

తేజ సజ్జ హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ చేస్తామని ప్రశాంత్ వర్మ ఎప్పుడో ప్రకటించారు. అయితే.. ఇందులో నటించాల్సిన రిషబ్ శెట్టి వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వలన ఇన్ని రోజులు ఈ మూవీ స్టార్ట్ కాలేదు.

ఇప్పుడు ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని ఈ ఇయర్ లో స్టార్ట్ చేసి నెక్ట్స్ ఇయర్ 2027లో భారీగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఇందులో తేజ సజ్జ పూర్తి స్థాయిలో కనిపించడు కానీ.. ఖచ్చితంగా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

తేజ సజ్జకు మంచి సక్సెస్ అందించిన మూవీ జాంబిరెడ్డి. ప్రశాంత్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా జాంబిరెడ్డి 2 చేయనున్నారు. ఈ సమ్మర్ లో ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 2027 జనవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మరో వైపు మిరాయ్ 2 స్క్రిప్ట్ సిద్దం అవుతుంది. ఈ సినిమాని ఆగష్టులో ప్రారంభించాలి అనుకుంటున్నారు.

2027 ఎండింగ్ లో ఈ మూవీని విడుదల చేస్తారు. ఇలా తేజ సజ్జ నుంచి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్, జాంబిరెడ్డి సీక్వెల్ జాంబిరెడ్డి 2, మిరాయ్ సీక్వెల్ మిరాయ్ 2 ఈ మూడు సీక్వెల్స్ వస్తాయి. ఒకే హీరో.. మూడు సీక్వెల్స్ చేయడం.. అది కూడా ఒకే సంవత్సరంలో రిలీజ్ కావడం అరుదైన రికార్డ్ అని చెప్పచ్చు. మరి.. ఈ మూడు సీక్వెల్స్ తో.. తేజ సజ్జ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

CLICK HERE TO READ రవితేజకి ఆ ఇద్దరు బ్లాక్ బస్టర్స్ అందించేనా..?
