లంబాడీల సంప్రదాయాలకు ప్రతీక
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని భూపాలపల్లి ఎమ్మెల్యే(Bhupalapalli MLA) గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ రోజు భూపాలపల్లి మున్సిపాలిటీ(Municipality) పరిధిలోని పెద్దకుంటపల్లి(11వ వార్డు)లో జరిగిన లంబాడీల తీజ్(Lambadila Teej) వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ (MLA GSR) హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు(Villagers), యువతులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం వారితో ఎమ్మెల్యే (MLA) స్టెప్పులేసి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఈ తీజ్ పండుగలో ఆట పాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలు, విలువలను భావితరాలకు(and Future) తీసుకువెళ్తుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లంబాడీ సామాజిక వర్గ అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. లంబాడీలకు అన్నిరంగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. తీజ్ వంటి పండుగలు(Festivals) సామాజిక ఐక్యతకు, సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని చెప్పారు.

