కోగంటి సరోజినికి నివాళులు…

కోగంటి సరోజినికి నివాళులు…
కంచికచర్ల, ఆంధ్రప్రభ : ఇటీవల మృతి చెందిన కోగంటి సరోజినికి పలువురు ఎన్నారై, తానా, వివిధ రంగాల ప్రముఖులు ఘన నివాళులర్పించారు. ఆదివారం కంచికచర్ల ఓసి క్లబ్లో జరిగిన కార్యక్రమంలో అమెరికాలోని ఎన్ఆర్ఐ స్పెషల్ రిప్రజెంటేటివ్ కోమటి జయరాం, సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ రవి మందలపు, తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీ జీవిఎన్ ప్రసాద్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, అప్పసాని రాజేష్, కోమటి సుధాకర్, ఆళ్ల గోపాలకృష్ణ, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సజ్జా అజయ్, రాష్ట్ర మార్కెటింగ్ యార్డ్ ల సంఘం ఉపాధ్యక్షులు కోగంటి బాబు, సినీ డైరెక్టర్, ఆర్టిస్ట్ కాశీ విశ్వనాధ్, తానా ట్రెజరర్ రాజా కాస్కుర్తి, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి, స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని కోగంటి సరోజిని చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ క్యాష్ ఇన్చార్జ్ కోగంటి వీరారావు, తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ వెంకట్ కోగంటి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
