ICC Rankings | నెంబర్ వన్ జ‌ట్టుగా టీమిండియా !

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ సేన అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవ‌ల‌ ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ మేరకు ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో భార‌త జ‌ట్టు 119 రేటింగ్ పాయింట్ల‌తో అగ్రస్థానం దక్కించుకుంది. 110 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.

మరోవైపు ట్రై-సిరీస్‌లో ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన న్యూజిలాండ్ జట్టు 105 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్ జట్టు ఫైనల్లో ఓడి 107 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. భారత్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన ఇంగ్లండ్ 7వ స్థానంలో నిలిచింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *