Teacher’s Day | సామాజిక చైతన్యం కోసమే మహిళా విద్య

Teacher’s Day | సామాజిక చైతన్యం కోసమే మహిళా విద్య
Teacher’s Day | మోత్కూర్, ఆంధ్రప్రభ : మహిళలు చదువుకుంటేనే సామాజిక చైతన్యం వస్తుందని సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసమే జీవితాన్ని అంకితం చేశారని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు తీపిరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం(Teacher’s Day) కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు డి.మంజుల, వి.కవిత, మర్రి.జయశ్రీ, ఎస్.విమలమ్మ, వై.కవిత, కె.రేవతి, ఆర్.ప్రణతి, షీలాబీలను ఘనంగా సన్మానించారు. సావిత్రిబాయి పూలే జీవితం, మహిళల విద్య కోసం ఆమె చేసిన కృషిని తమ ప్రసంగాల ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవిందరాయుడు,ఇండ్ల రాంప్రసాద్ కే.శ్రీనివాస్, సుధీర్ కుమార్, రామకృష్ణ, ఏ.వెంకటాచారి, రవీందర్ రెడ్డి జె.ప్రవీణ్, జె.రవికుమార్, ఆర్.వెంకటాచారి, బి.లింగయ్య, ఉప్పలయ్య, ఎం.శశికుమార్, ఇ.శంకర్ , ఎం వెంకటేశ్వర్లు, ఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
