ఉద్యమం చేపడితే తప్ప సమస్యలు పరిష్కారం కావా?..

ఉద్యమం చేపడితే తప్ప సమస్యలు పరిష్కారం కావా?..

ఉపాధ్యాయుల పరిష్కరిస్తారో- ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం..
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఎన్నికల ముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఎన్నికల మేనిపేస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల సాధనలో భాగంగా మూడవ దశ ఉద్యమం సమర శంఖారావం కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిశ్రీనివాస్ ల అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ఉద్యమంలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నంద్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.చంద్రశేఖర్ యం.అజాం బేగ్ లు మాట్లాడరు. అధికారంలోకి రావడానికి ముందు ఉద్యోగులకు 12వ పి.ఆర్.సి. కమీషన్ ను నియమించి వెంటనే 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలన్నారు. పెండింగులో ఉన్న నాలుగు కరువు భత్యం బకాయి అరియర్స్ ను చెల్లించాలన్నారు. సరెండర్ లీవు బకాయిలు సంవత్సరాలు అయిన విడుదల చేయగా పోవడం, కరోనాలో చనిపోయిన ఉపాధ్యాయ కుటుంబ సభ్యులకు కారుణ్యానియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనకు దూరం చేయవద్దు అని వేడుకున్నారు.

మినిమం టైం స్కేల్ టీచర్లను కాంటాక్ట్, పొరుగు సేవల పద్దతిలో శ్రమ దోపిడీ ఆపి వారందరికీ రెగ్యులర్ చెయ్యాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన పలు మార్లు విన్నవించినప్పటికీ శరణం లేకపోవడంతో ధర్నా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయ పరమైన మా డిమాండ్లు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెనకాడమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదన్నపు ప్రధాన కార్యదర్శి వై. వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర నాయకులు గిరిబోయిన నాగేంద్ర కుమార్, శివశంకర్, ఈ పూరి వెంకట గోపాలకృష్ణ, మౌలాలి, నరసింహ రావు, వై.ప్రసాద్, పి.శ్రీనివాసరావు, వెంకట్ నాయక్, రమేష్, వెంకటరమణ, సుదాకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply