TDP | ఇది భక్తుల మనోభావాలపై దాడే…
దేవుడు, ఆలయాల పవిత్రతపై జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదు : టీడీపీ
TDP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : దేవుడు, ఆలయాల పవిత్రతపై జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ మండిపడ్డారు. ఆదివారం మచిలీపట్నంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి బాబాయి హత్య చిన్న విషయం అయినప్పుడు, ఇక పరకామణి చోరీ కేసు పెద్ద విషయం ఎలా అవుతుందన్నారు. తిరుమల పరకామణిలో కోట్లాది రూపాయల ఆస్తి దోచుకునేందుకు సిద్ధపడ్డారంటే ఆయన, వారి పరివారం ఇంకెంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు. దేవుడి ఆలయాల పవిత్రతపై జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదని ఆగ్రహించి, ఆయన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలపై దాడేనని వారు వ్యాఖ్యానించారు. పరకామణిలో దొంగతనాన్ని తప్పు కాదని సమర్థించడం నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

