ఇంటి పన్నులు త్వరగా చెల్లించండి…

ఇంటి పన్నులు త్వరగా చెల్లించండి…
రాప్తాడు, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని పంచాయతీ సెక్రెటరీలకు ఎంపీడీవో విజయలక్ష్మి సూచించారు.శనివారం రాప్తాడు గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను చెల్లించని ఇల్లు అపార్ట్మెంట్ లు ప్రైవేట్ స్కూల్ యజమానుల వద్దకు వెళ్ళి ఇంటి పన్ను ఆన్ లైన్ ద్వారా ఎలా చెల్లింపులు చేసుకోవాలో అవగాహన కల్పించారు.
ఈ సంధర్భంగా ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ పన్ను చెల్లించి గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈనెల 15 లోపు 100 శాతం ఇంటి పన్ను వసూళ్లు చేయాలని ఇంటి పన్ను చెల్లించని యజమానులకు నోటీసులు జారీ చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్ బాబు, అచ్యుతానంద బాబు, పంచాయతీ సెక్రెటరీ శమంతకమణి, డిజిటల్ అసిస్టెంట్ సూర్య ప్రకాష్, బిల్ కలెక్టర్ రవి వెల్ఫేర్ సందీప్, మహిళా పోలీస్ సరిత, తదితరులు పాల్గొన్నారు.
