Tax |పన్ను ఎగవేతదారులకు రెడ్ నోటీసులు

Tax |పన్ను ఎగవేతదారులకు రెడ్ నోటీసులు

  • నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశం
  • అప్పటికి చెల్లించకపోతే కుళాయి కనెక్షన్ కట్

Tax |కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : నగరంలో ఏడాదికి పైగా నగరపాలక సంస్థకు పన్నులు చెల్లించకుండా ఉన్న మొండి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో నోడల్ అధికారులు, రెవెన్యూ విభాగ సిబ్బందితో పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పన్ను ఎగవేతను అరికట్టి ఆదాయ వనరులను బలోపేతం చేయడం లక్ష్యంగా బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని తెలిపారు. దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నోటీసులు అందుకున్నప్పటికీ నిర్దిష్ట గడువులోగా బకాయిలు చెల్లించని పక్షంలో కుళాయి కనెక్షన్లు నిలిపివేయడం వంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. పన్నులు సమయానికి చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, స్వచ్ఛందంగా బకాయిలు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Tax |

Leave a Reply