TEST | టాలెంట్ టెస్ట్..

TEST | టాలెంట్ టెస్ట్..

శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి…

TEST | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : జనవిజ్ఞాన వేదిక నెల్లికుదురు మండల శాఖ అండ్ జాతీయ సేవా పథకం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురులో చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ (Talent Test) జెవివి అధ్యక్షులు దేశెట్టి యాకన్న, ప్రధాన కార్యదర్శి మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కళాశాల ఇన్ చార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ హాజరై టెస్ట్ ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. ఈ టెస్ట్ కు మండలంలోని 7 ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విభాగం నుండి టిజిఎంఎస్ నెల్లికుదురు విద్యార్థులు, రెసిడెన్షియల్ విభాగం నుండి కేజీబీవీ విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దేశెట్టి యాకన్న మాట్లాడుతూ.. జనవిజ్ఞాన వేదిక ద్వారా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను పారద్రోలడానికి కృషి చేస్తున్నదని, టాలెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడానికి అవకాశం కలుగుతుందని, విద్యార్థులు సైన్స్(Students Science) పట్ల అవగాహన పెంపొందించుకొని, భావిభారత శాస్త్రవేత్తలుగా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కందికొండ బాబు, చెకుముకి కన్వీనర్ పెద్దూరి వెంకటేశ్వర్లు, కళాశాల అధ్యాపకులు కవిరాజు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, యాదగిరి, దేవేందర్, సతీష్ కుమార్, జబ్బర్, వినోద, కక్కర్ల లక్ష్మణ్ , బోనగిరి గౌరీ శంకర్, వివిధ పాఠశాలలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply