హైదరాబాద్ : మలక్ పేటకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీగల అజిత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సునరిత రెడ్డి దంపతులను శనివారం మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. వారి కుమారుడు కనిష్క్ రెడ్డి ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ముసారాంబాగ్ లోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆజాం, సామా ప్రభాకర్ రెడ్డి, విఠల్ రెడ్డి, నర్సింగ్, నరేష్, తదితరులున్నారు.