బాధ్యతల స్వీకరణ

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లాకు నూతన జిల్లా కలెక్టర్‌గా ఏ. శ్యాంప్రసాద్‌(A. Shyam Prasad as District Collector) లెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబరులో పూజలు చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించారు.

సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నకలెక్టర్‌కు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రామసుబ్బయ్య(M. Ramasubbayya), కలెక్టరేట్ ఏవో వెంకట నారాయణ, వేదపండితులు పూర్ణకుంభం, భాజాభజంత్రీల(Bhajabhajantrila)తో స్వాగతం పలికారు.

జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వివిధ జిల్లా అధికారులు(district officials), రెవిన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు కలెక్టర్‌ని మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కలు, పుష్పగుచ్చాలు అందజేశారు.

Leave a Reply