కశింకోట, (ఆంధ్రప్రభ) : మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ వలలో చిక్కాడు. డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు వివరాల ప్రకారం…
జట్టపురెడ్డి తుని గ్రామానికి చెందిన రైతు ఊడి నాగేశ్వరరావు తన భూమికి సంబంధించిన మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశాడు. ఆ పని జరగాలంటే వీఆర్వో సూర్య సాయి కృష్ణ పృద్వి రూ.4 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది.
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు శనివారం పంచాయతీ కార్యాలయంలో వీఆర్వోకు రూ.20 వేలు అందజేశాడు. పథకం ప్రకారం మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆ సమయంలోనే వీఆర్వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.


