దోమల నివారణకు చర్యలు తీసుకోండి

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ ; భీంగల్ మున్సిపల్ లోని వార్డుల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ పట్టణంలో డ్రైనేజీ లో మురికి పేరుకు పోవడంతో దోమల బెడద ఎక్కువ అయ్యిందని పేర్కొన్నారు. దోమల వ్యాప్తి విపరీతం అవ్వడం వలన ప్రజలు డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ మిషన్ ద్వారా పొగ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో పాటు అన్ని వార్డులో చెత్త పేరుకు పోవడంతో మున్సిపల్ లో నిధులు ఉండడం వల్ల వాటితో చెత్త సేకరించడానికి 4 కొత్త ఆటోలు కొనుగోలు చేయాలన్నారు. కౌన్సిలర్ సభ్యుల వినతి మేరకు చర్యలు తీసుకుంటానని కమీషనర్ హామీ ఇచ్చారు. మున్సిపల్ కమీషనర్ కు కౌన్సిలర్ లు బోదిరే నర్సయ్య, గున్నాల బాల లక్మీ ( భగత్ ), మల్లెల అనుపమ ( ప్రసాద్ ) వినతి పత్రం అందజేశారు.
