కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జైనూర్, ఆంధ్రప్రభ ; కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాత్ రావు, మాజీ సహకార చైర్మన్ హన్ను పటేల్, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ కోరారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ గోదాంలో మార్క్ఫెడ్, నాఫేడ్ ఆధ్వర్యంలో సహకార సంఘం సౌజన్యంతో నిర్వహించే నూతనంగా ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని వారు శనివారం ప్రారంభించారు. మొదటిరోజు కందుల క్వింటాల్ మద్దతు ధర 8,000 తో కొనుగోలు చేయడం జరిగిందని వారు తెలిపారు.

రైతులు పండించిన కందు పంట ధాన్యాన్ని ఈ కేంద్రానికి తీసుకువచ్చి కందులను విక్రయించి అధిక మద్దతు ధర పొందాలని చైర్మన్లు సర్పంచ్ కోరారు. ప్రభుత్వం రైతుల పండించిన కందుల ధాన్యాన్ని అధిక మధ్యధరతో కొనుగోలు చేయడానికి రైతుల సౌకర్యార్థ ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్, ఉప సర్పంచ్ డోంగ్రే ప్రకాష్, సిర్పూర్ (యు) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవిందరావు, జై నూరు మండల వ్యవసాయ అధికారి రాజేందర్, జైనూర్ సహకార సంఘం సీఈఓ సోన్ కాంబలే జనార్ధన్, జై నూర్ మాజీ మండల ఉపాధ్యక్షులు చిర్లే లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ యువ నాయకులు మేష్ర0 అంబాజీరావు, బీర్షావ్, జనగాం మాజీ సర్పంచ్ కుమ్ర శ్యామ్ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply