T20 world cup | వెస్టిండీస్ బ్యాటింగ్

T20 world cup | వెస్టిండీస్ బ్యాటింగ్

అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా- వెస్టిండీస్‌ మధ్య సూపర్‌-8 మ్యాచ్‌
భారత్‌ సెమీస్‌ చేరే అవకాశాలను ప్రభావితం చేయనున్న మ్యాచ్‌ ఫలితం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా గురువారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ ప్రారంభ‌మైంది. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు టాస్ గెలిచింది. ఈ జ‌ట్టు కెప్టెన్ ఐడెన్ మార్‌క్ర‌మ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. ఇక ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధిస్తే భార‌త్‌కు సెమీస్ చేరుకునేందుకు ఈజీ అవుతుంది. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించాల‌ని భార‌త అభిమానులు కోరుకుంటున్నారు.

‘మేము ముందుగా బౌలింగ్ చేయాల‌ని అనుకుంటున్నాము. వికెట్ చాలా బాగుంది. ఇక్క‌డి ప‌రిస్థితుల‌పై అంచ‌నా ఉంది. తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేవు.’ అని ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్ర‌మ్ అన్నాడు. ‘టాస్ గెలిచి ఉంటే మేము కూడా బౌలింగ్ ఎంచుకుని ఉండేవాళ్లం. అయినా ఏం కాదు. భారీ స్కోరు చేసి ప్ర‌త్య‌ర్థిని ఒత్తిడిలోకి నెడ‌తాము. తుది జ‌ట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. అకిల్ హోస‌న్ స్థానంలో రోస్ట‌న్ ఛేంజ్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.. అని వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తెలిపాడు.

Leave a Reply