T20 World cup | ఆడుతారో.. లేదో..?

T20 World cup | ఆడుతారో.. లేదో..?

  • బంగ్లా జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌టంపై సందిగ్ధం!

T20 World cup | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రాబోయే టీ20 వరల్డ్ కప్ వివాదాల‌కు కేరాఫ్‌గా మారింది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందే పెను సంచలనంగా మారింది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బంగ్లాదేశ్ జ‌ట్టు ఆడేది లేనిది సందిగ్ధంగా మారింది. ఈ టోర్నీలోని మ్యాచుల‌ను భార‌త్‌, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల కార‌ణంగా భార‌త్‌లో మ్యాచులు ఆడ‌మ‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంటుంది. భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ పట్టుబట్టడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నేడు(జనవరి 21) తన తుది నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న‌ టీ20 ప్రపంచ కప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.

T20 World cup | అస‌లేం జ‌రిగిందంటే..?

బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను భార‌త్‌లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కు ఆడుతున్న‌ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని డిమాండ్ వ‌చ్చింది. దీనికి బీసీసీఐ కూడా అత‌న్ని తొల‌గించాల‌ని ఆదేశించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిచర్యగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. ఆ తర్వాత వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.

T20 World cup | వేదిక మార్చ‌డం వీలు కాదు.. ఐసీసీ

మరోవైపు షెడ్యూల్ మార్చే ప్రసక్తే లేదని, భారత్‌లో భద్రతా ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే ఇటీవల జనవరి 21 (ఈరోజు) లోపు తమ నిర్ణయాన్ని తెలపాలని ఐసీసీ బంగ్లాదేశ్‌కు గడువు విధించింది. ఒకవేళ బంగ్లాదేశ్ తప్పుకుంటే, వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకునే అవకాశం ఉంది. గ్రూప్-సీలో ఉన్న బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో కోల్‌కతాలో ఆడాల్సి ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ తన మొండిపట్టు వీడకపోతే ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారీ జరిమానాతో పాటు టోర్నీ నుండి బహిష్కరణ తప్పకపోవచ్చు. నేడు వెలువడే ఐసీసీ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించనుంది.

T20 World cup

T20 World cup | బంగ్లా కెప్టెన్ ఏమ‌న్నాడంటే..?

బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిట్టన్ దాస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు జట్టులోని అయోమయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. “మేం వరల్డ్ కప్ ఆడతామనే నమ్మకం మీకు ఉందా? నాకు కూడా తెలియదు. అసలు మేము ఏ దేశంతో ఆడతామో, ఎక్కడ ఆడతామో ఎవరికీ క్లారిటీ లేదు. దేశమంతా ఇప్పుడు అనిశ్చితిలో ఉంది.” అని అన్నాడు. దీనిని బట్టి చూస్తే బంగ్లాదేశ్ జట్టు అయోమయంలో ఉందని తెలుస్తోంది.

CLICK HERE TO READ దెబ్బ‌కు దెబ్బ కొట్టేనా?

CLICK HERE TO READ MORE

Leave a Reply