t20| కప్ వేటలో భారత్

t20| కప్ వేటలో భారత్
సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి టీమిండియా
ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత్
ఆఖరి పోరాటంలో ఇక కివీస్‌తో అమీతుమీ..
ఈనెల 8న ఆదివారం తుదిపోరు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ముంబైలోని వాంఖడే స్టేడియం భారత్ విజయనాదంతో మార్మోగిపోయింది. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా దూసుకెళ్లింది. కప్ కొట్టేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఫైనల్లోనూ గెలిచి మొత్తంగా మూడో సారి కప్‌ను ముద్దాడాలని భారత్ చూస్తోంది. ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా ఉత్కంఠపోరులో విజయం సాధించింది. సూర్యకుమార్ సేన పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. ఇంగ్లాండ్ పై సంజూ శాంసన్ సునామీ సృష్టించి బ్రిటిష్ జట్టు గుండెల్లో వణుకు పుట్టించాడు. ఉత్కంఠ పోరులో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఈ నెల 8న అహ్మదాబాద్‌లో ఫైనల్ వేటకు భారత్ సిద్ధమైంది. తుది పోరులో న్యూజిలాండ్‌తో ఢీకొనేందుకు సిద్ధమైంది.
మొదట టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్ ప్లేయర్స్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబేల అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. ఓపెనర్ సంజూ శాంసన్ (89) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ది T20 ప్రపంచ కప్ నాకౌట్‌లో అత్యధిక స్కోరు. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ జట్టు చివరి వరకూ పోరాడిన ప్రయోజనం దక్కలేదు. సెంచరీ హీరో జాకబ్ బెథెల్ (48 బంతుల్లో 105 పరుగులు) చివరి ఓవర్లో రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 246 పరుగులు చేయడంతో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో హర్ధిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.
