దసరాకు స్వీట్ స్వీట్

దసరాకు స్వీట్ స్వీట్

  • ఇక దీపావళికి హాట్ హాట్
  • 10 గ్రాముల మేలిమి బంగారం
  • త్వరలో రూ.1.25 లక్షలే
  • ఇదీ పసిడి ప్రియుల అంచనా

బిజినెస్ డెస్క్, ఆంధ్రప్రభ : ఔను అనుకున్నదే జరిగింది. దసరాకు బంగారం ధర(gold price) పెరుగుతుంది. దీపావళికి ఈ ధర దూసుకుపోతుంది. బంగారం ప్రియుల అంచానాలు ఎక్కడా పిల్లి మొగ్గలు వేయలేదు. ఎందుకంటే.. దసరా(Dussehra) సందట్లో సడేమియాలా బంగారం ధర దూసుకు పోతోంది. మరో 17 రోజుల్లో దీపావళి బొనంజా పలకరిస్తోంది. దసరా పండక్కిపొగలు కక్కే పాయసాన్ని అందించిన బులియన్ మార్కెట్(bullion market) ఇక దీపావళికి ఎలాంటి రుచిని నోటికి అందిస్తుందోనని పసిడి ప్రేమికులు ఉత్కంఠగా ఉన్నారు.

దీపావళి(Diwali)లోపే తేరుకుని బంగారం కొనేయాలని మరి కొందరు బ్యాంకు బ్యాలెన్సులు సర్దుతున్నారు. సరీగా 50 రోజుల కిందట అంటే ఆగస్ట్ 20 న మేలిమి బంగారం ధర రూ.1,00,150లు ఉంటే.. అక్టోబర్ 1న రూ.18,490 ధర పెరిగింది. ఇక ఆభరణాల 22 క్యారట్(22 carat) బంగారం ధర రూ.91,800లు ఉంటే బుధవారం రూ.1,08,750 ధరకు చేరింది. అంటే రూ.16,950లు పెరిగింది. ఈ 50 రోజుల్లోనే బంగారం ధర 18 శాతం పెరిగిందన్నమాట.

ఇక దీపావళికి బంగారం ధర రూ. 1,25,000ల గీత దాటుతుందనే అనుమానాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్‌(market trend)ను పరిశీలిస్తే, దీపావళికి పది గ్రాముల బంగారం ధర 1,25,000 రూపాయలకు చేరటం ఖాయమని మార్కెట్ ఎనలిస్టులు అంచావేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు, యుద్ధాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. షేర్ మార్కెట్లు ఎప్పుడు గతుక్కుమంటాయో తెలియని స్థితి. ఇక బంగారం విలువ.. తరుగు పోతే.. విలువ స్థిరం. వడ్డీ రేట్లు తగ్గే సూచనలతో పెట్టుబడిదారులు బంగారాన్ని స్థిరాస్తిగా భావిస్తున్నారు.

ఇక ఏపీ, తెలంగాణల్లో బుధవారం బులియన్ మార్కెట్‌లో ధరల పరిస్థితి పరిశీలిద్దాం. మంగళవారం రాత్రి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగాధర రూ.1,17,440లకు చేరగా బుధవారం ఉదయం 9.00 గంటలకు అందిన సమాచారం మేరకు విజయవాడ(Vijayawada)లో నిన్నటి ధరకూ రూ.10లు జత కలిసింది. అంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,450లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,07,660లకు , 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 88,090లకు చేరింది.

బుధవారం రాత్రి 7.00 గంటలకు అందిన సమాచారం మేరకు అంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,18,640లుకు చేరింది. అంటే ఉదయం నుంచి ఇప్పటికి ధర 1200లు పెరిగింది. మంగళవారం పెరిగిన ధరను కలిపితే ఈ రెండు రోజుల్లోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,230లు జత కలిసి రూ.1,18,640లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,07,660ల నుంచి రూ.1,08,750లకు చేరింది. ఒక్క రోజులోనే రూ.1090ల ధర పెరిగింది. 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 88,080ల నుంచి రూ.88,980లకు అంటే ఈ ఒక్క రోజునే రూ.900లు పెరిగింది.

  • ఇక తెలంగాణలో బంగారం ధర గోల్డ్ లవర్స్కు అంతు చిక్కటం లేదు. అధికారికంగా ఓ ధర.. అనధికారికంగా మరో ట్రెండ్ నడుస్తోంది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర .. రూ. 1,24,000లు దాటినట్టు విస్తృత ప్రచారం నేపథ్యంలో.. ఈ రోజు బులియన్ మార్కెట్ సమాచారం మేరకు, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,17,450లు.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,07,660లు, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.88,040లకు చేరింది.
  • ఈ రోజు రాత్రి 7.00 గంటలకు అందిన సమాచారం మేరకు ఉదయం నుంచి ఇప్పటికి ధర 1200లు పెరిగింది. మంగళవారం(Tuesday) పెరిగిన ధరను కలిపితే ఈ రెండు రోజుల్లోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,230లు జత కలిసి రూ.1,18,640లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,07,660ల నుంచి రూ.1,08,750లకు చేరింది. ఒక్క రోజులోనే రూ.1090ల ధర పెరిగింది. 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 88,080ల నుంచి రూ.88,980లకు అంటే ఈ ఒక్క రోజునే రూ.900లు పెరిగింది.

నగరం 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 18 క్యారెట్స్
హైదరాబాద్ రూ.11,864లు రూ.10,875లు రూ.8,898లు
వరంగల్ రూ.11,864లు రూ.10,875లు రూ.8,898లు
విజయవాడ రూ.11,864లు రూ.10,875లు రూ.8,898లు
గుంటూరు రూ.11,864లు రూ.10,875లు రూ.8,898లు
విశాఖపట్నం రూ.11,864లు రూ.10,875లు రూ.8,898లు
చెన్నై రూ.11,880లు రూ.10,890లు రూ.9,015లు
కోల్కత్త రూ.11,864లు రూ.10,875లు రూ.8,898లు
ముంబై రూ.11,864లు రూ.10,875లు రూ.8,898లు
ఢిల్లీ రూ.11,864లు రూ.10,875లు రూ.8,898లు
బెంగళూరు రూ.11,864లు రూ.10,875లు రూ.8,898లు
కేరళ రూ.11,864లు రూ.10,875లు రూ.8,898లు
అహ్మదబాద్ రూ.11,869లు రూ.10,880లు రూ.8,903లు
వడోదర రూ.11,750లు రూ.10,771లు రూ.8,930లు

Leave a Reply