హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకులకు రీకాల్ జారీ చేసింది. వెనుక బ్రేక్ సమస్యల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి నుంచి 2025 జూన్ మధ్యలో తయారైన 5145 యూనిట్ల బైకులపై ఈ రీకాల్ ప్రభావం పడింది.
అయితే వినియోగదారుల నుంచి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. వెనుక బ్రేక్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం ప్యాడ్‌లు, బ్రేక్ డిస్క్‌ల మధ్య సరైన కనెక్షన్ లేకపోవడమే. అత్యవసర సమయంలో బ్రేకింగ్ సమస్య ఏర్పడుతుంది కాబట్టి కంపెనీ దీనిని పరిష్కరించడానికి ఈ రీకాల్ జారీ చేసింది.
ఫిబ్రవరి 2024లో కూడా ఇంజిన్ క్యామ్‌షాఫ్ట్ సమస్య కారణంగా సుజుకి జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250, వీ-స్ర్టామ్ ఎస్ఎక్స్ బైకులకు రీకాల్ జారీ చేసింది.
సుజుకి జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 వినియోగదారులు బైకులోని సమస్యను పరిష్కరించుకోవడానికి సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ, సాంకేతిక నిపుణులు మోటార్‌సైకిల్‌ను తనిఖీ చేసి, కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన మరమ్మతులు చేస్తారు.