ఆంధ్రప్రభ, ఏర్పేడు (తిరుపతి జిల్లా) : మొంథా తుఫాన్ దాటికి ఏర్పేడు మండలంలో పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది . నచ్చనేరి గ్రామపంచాయతీలో గిరిజనుల ఇల్లు రెండు నెలకొరిగాయి.
పాక్షికంగా దెబ్బతిన్న గిరిజనుల ఇళ్ల నుంచి గిరిజనులను సురక్షిత ప్రదేశానికి తరలించి అధికారులు వారికి అవసరమైన ఏర్పాట్లు తహసిల్దార్ భార్గవి ఎంపీడీవో సౌభాగ్యమ్మ ఆధ్వర్యంలో వసతులు ఏర్పాటు చేశారు. కోబాక పంచాయతీలోని గిరిజనులను 23 మందిని సురక్షిత ప్రదేశానికి తరలించారు.
వాగులు ,వంకలు దాటకుండా గ్రామాలలో దండోరా వేసి అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో నది ఎవరు దాటకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు గుడిమల్లం వద్ద శీతకాలవ పొంగి ప్రవహిస్తూ ఉంది.
మండలంలోని అనేక చెరువులు దాదాపు పూర్తిగా నిండాయి. అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు నాయుడు ఇతరులు పర్యటిస్తూ గ్రామాల్లో అవసరమైన ఏర్పాట్లను చూస్తున్నారు.



