Suspicious | బైక్ కాలువలో పడి..
వివాహిత మృతి.. కుమారుడి గల్లంతు
Suspicious | పల్నాడు, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా నరసరావుపేటలో అనుమానాస్పద (Suspicious) స్థితిలో కాలువలో పడి వివాహిత మృతి చెందగా, ఆమె కుమారుడు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. రొంపిచర్ల మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుమారుడు శరత్ (7నెలలు) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో శుక్రవారం రాత్రి అతడు.. కుమారుడు, భార్య త్రివేణి (25)తో కలిసి నరసరావుపేట (Narasaraopet) లోని ఆసుపత్రికి బైక్ పై వెళ్తున్న క్రమంలో కాలువ వద్ద ఓ వాహనం అడ్డురావడంతో… దాన్ని తప్పించబోయి బైక్ అదుపుతప్పి పడిపోయింది.
దీంతో శరత్, త్రివేణి కాలువలో పడ్డారు. శ్రీకాంత్ (Srikanth) ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, త్రివేణి మృతదేహం లభ్యమైంది. శరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భార్యను, కుమారుడిని భర్త హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నట్లు వివాహిత కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

