యువ డాక్టర్ అనుమానాస్పద మృతి

నర్సంపేట, క్రైం, ఆంధ్రప్రభ : పట్టణంలో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ శశిధర్ రెడ్డి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. తోటి వైద్యుల అభిప్రాయం ప్రకారం.. అకస్మాత్తు గుండెపోటే కారణంగా ఉండొచ్చు. యువ వైద్యుడి అకాల మరణం స్థానికుల్లో దిగ్భ్రాంతి, విషాదాన్ని రేపింది. హాస్పిటల్ సిబ్బంది, ఆసుపత్రికి వచ్చే స్థానికులు షాక్‌లో మునిగారు. డాక్టర్ శశిధర్ రెడ్డి పట్టణంలో ఎన్నో సేవలు అందించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
