సుజాత, సాజిద్ ఖాన్ పై సస్సెన్షన్ ఎత్తివేత
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : పీసీసీ(Political ) మాజీ ప్రధాన కార్యదర్శి గంట సుజాత, మాజీ డీసీసీ(DCC) అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. సస్పెన్షన్(Suspension) వేటుకు గురై గత 20 నెలలుగా రాజకీయాల(Politics)కు దూరంగా ఉంటున్న ఆదిలాబాద్(Adilabad) జిల్లా సీనియర్ నాయకులు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవరెడ్డి లను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ రోజు హైదరాబాదులోపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డిలకు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ(Adilabad) క్రమశిక్షణ చర్యల కింద ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు పడ్డ సీనియర్ నేతలను తిరిగి(Comeback) పార్టీలో చేర్చుకోవాలనీ ఏఐసీసీ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం సీనియర్లను తిరిగి సొంతగూటికి ఆహ్వానించినట్టు తెలిసింది.
అదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అసమ్మతినేతులను పార్టీలో చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి పార్టీలో చేరకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ జిల్లా కాంగ్రెస్(Congress) నేతల అభ్యర్థన మేరకు పీసీసీ చీఫ్ తిరిగి వీరిని పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ హై కమాండ్ సస్పెన్షన్ వేటు తొలగించడం, పార్టీలోకి ఆహ్వానించడం తాము సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని సుజాత, సాజిద్ ఖాన్ పేర్కొన్నారు.

