Muncipal |రిజ‌ర్వేష‌న్‌పై ఉత్కంఠ‌

రిజ‌ర్వేష‌న్‌పై ఉత్కంఠ‌

మునిసిపాలిటీ చైర్మన్ పదవిపై చ‌ర్చ‌

Muncipal |వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్: వికారాబాద్ మున్సిపాలిటీకి ఇప్పటివరకు జరిగిన ఆరు చైర్మన్ ఎన్నికల్లో రెండు దఫాలు ఎస్సీలకు ఒక దఫా బీసీ మహిళకు మూడు దఫాలు జనరల్ కేటగిరికి కేటాయించారు. ఎస్సీ చైర్మన్లుగా దివంగ‌త‌ దేవదాసు, బి సంజీవరావులుగా వ్యవహరించగా, అనంతరం బీసీ మహిళా జయ నర్సింగరావు చైర్‌ప‌ర్స‌న్‌గా వ్యవహరించారు. జనరల్ చైర్మన్‌గా లంక పుష్పలాచారెడ్డి చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్నారు. అనంతరం వి. సత్యనారాయణ చైర్మన్‌గా ఉన్నారు.

ఇటీవల తాజాగా వికారాబాద్ మునిసిపల్ చైర్‌ప‌ర్స‌న్‌గా చిగుళ్లపల్లి మంజుల రమేష్ వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడంతో రిజర్వేషన్‌ను త్వరలో ఖరారు చేయనున్న సమాచారంతో మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఏమవుతుందన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొని ఉంది.

Leave a Reply