Surrender | రాచకొండ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ దంప‌తులు…

హైద‌రాబాద్ – తెలంగాణలో (Telangana) మావోయిస్టులు (Maoists) జనజీవన స్రవంతిలో (society ) కలిసిపోతున్నారు. అనేక మంది మావోలు ఆయుధాలు విడిచిపెట్టి ( Arms dropped )జనంలోకి వస్తున్నారు. తాజాగా రాచకొండ పోలీసుల (rachakonda police ) ఎదుట ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ (sanjeev) , ఆయన భార్య దీనా పోలీసులకు సరెండర్ అయ్యారు.

ఆంధ్ర, తెలంగాణ, దండకారణ్య ప్రాంతంలో ఈ ఇద్దరు మావోయిస్టులు పనిచేస్తున్నారు. గద్దర్‌తో పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా సంజీవ్ ఉన్నారు. అలాగే దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రెటరీగా కూడా సంజీవ్ పనిచేశారు. సంజీవ్‌తో పాటు ఆయన భార్య దీనా కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరిని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీపీ సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. రెండు రోజుల క్రితం ఆత్రం లచ్చన్న, చౌదరీ అంకు భాయి రామగుండం పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. వారం వ్యవధిలోనే నలుగురు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Leave a Reply