సుజనాచౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత…

సుజనాచౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత…
భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆరుగురికి సీఎం సహాయనిధి కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖలు రాసారు.. నియోజకవర్గంలో వివిధ రకాల దీర్ఘ కాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధ పడే వారూ మెరుగైన వైద్యం కోసం సర్జరీల నిమిత్తం ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు.. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విషయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు.. ఆయన ఐదుగురికి 18,93,200/- రూపాయల అంచనాతో ఎల్వోసీ లేఖలను, ఒకరికి 1,72,479/- విలువైన ఎల్వో ఆర్ లేఖలను సీఎం సహాయ నిధికి రాసారు..
వీటికి సంబంధించిన పత్రాలను లబ్ది దారుల కుటుంబ సభ్యులకు మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో అంద చేశారు.. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.. కార్యక్రమంలో ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, ఎండి హర్షద్ టీడీపీ నాయకులు పొనుగంటి సుబ్బయ్య, సంతోష్ ఏపీ స్టేట్ శాప్ డైరెక్టర్ 43వ డివిజన్ జనసేన అధ్యక్షులు బొల్లేపల్లి కోటేశ్వరరావు, 48 49 క్లస్టర్ ఇంచార్జ్ టిడిపి దివిటి ప్రభుదాస్, 41వ డివిజన్ అధ్యక్షులు బిజెపి జై బాలన్ చెల్లం రాజు ట్రస్ట్ చైర్మన్ ముదిగొండ శివ, పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత నాయకులు గూడెల మహేష్, సుజినా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు..
