ఢిల్లీ : ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో సంజయ్ పై ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పి.కె.మిశ్రా ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్ కు నోటీసులు జారీ చేసింది.
AP | సీఐడీ మాజీ చీఫ్ కు సుప్రీంకోర్టు నోటీసులు
