Supreme Court | ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు

Supreme Court | ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు

  • ఏ కేసులో అంటే…

Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆమె డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సీబీఐ వాదనలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. వేరే కేసుగా భావించి ఈ కేసులో తొలుత స్టే ఇచ్చామని జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ ధర్మాసనం పేర్కొంది. ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని తెలిపింది.

ఓబులాపురం గనుల కేసులో నిబంధనలకు అనుగుణంగా వెళ్లానని ఐఎఎస్‌ శ్రీలక్ష్మి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే శ్రీలక్ష్మి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆమె మరిది భారీగా అక్రమాస్తులు సంపాదించారని ధర్మాసనానికి సిబిఐ వెల్లడించింది. ఆమె లంచం కూడా డిమాండ్‌ చేసినట్టు సాక్ష్యాలు వాంగ్మూలం ఇచ్చారని సుప్రీం ధర్మాసనానికి సిబిఐ అధికారులు తెలిపారు. విచారణ అనంతరం శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Leave a Reply