హోంగార్డ్స్ సంక్షేమానికి అండగా..

హోంగార్డ్స్ సంక్షేమానికి అండగా..

  • పోలీసులకు దీటుగా హోంగార్డుల విధి నిర్వహణ
  • జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్
  • ఘనంగా 63 హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం 63వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పాల్గొని హోంగార్డుల‌ గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ “పోలీస్ శాఖలో నిస్వార్ధ సేవయే మా దృఢ‌ నిశ్చయం అనే ఉద్దేశంతో సేవ చేస్తున్న‌ హోంగార్డలందరికి నా అభినందనలు. సమాజసేవలో, శాంతి భద్రతలు పరిరక్షించుటలో పోలీసులతో కలిసి పని చేయ‌డం గొప్పదన్నారు. పోలీసు సిబ్బందితో పోలిస్తే హోంగార్డులకు సౌకర్యాలు తక్కువ ఉన్నా కూడా కొన్ని సంద‌ర్భాలలో వారి కంటే ఎక్కువ సేవ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో జిల్లా పోలీస్ శాఖ తరపున హోంగార్డులకు అభినందనలు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తోపాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి ఎం.జావళి, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు బాబు, మంజునాథ్, సురేష్ బాబు ఆర్‌ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply