నిరుపేద కుటుంబానికి అండగా..

నిరుపేద కుటుంబానికి అండగా..

మక్తల్, ఆంధ్రప్రభ – మక్తల్ ప్రాంతానికి చెందిన సత్తమ్మ వెంకటేష్ అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్సకు వైద్య సహాయం కోసం పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని సంప్రదించారు. ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 3లక్షల రూపాయల ఎల్ఓసి కాపీని మంజూరు చేయించారు. సంబంధిత ఎల్ఓసి కాపీని మంత్రి హైదరాబాద్ లోని అధికారిక నివాసంలో వారికి అందచేశారు. మంచి వైద్యం అంది, బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మీ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చినందుకు సంతోషిస్తున్నాను. రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. సత్తమ్మ.. మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.

Leave a Reply